Pages

Vinayaka Vratakalpam in Telugu

Vinayaka Vratakalpam in Telugu
Vinayaka Vratakalpam in Telugu
How to perform Vinayka Vrat? Vinayak Puja, Ganesh Chaturthi Puja? How to perform Ganesh Chaturthi Puja?

వినాయక వ్రతకల్పం

పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః 
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమ బొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః
శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/ గంగా/ గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే(ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ, శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ద్యర్థం, ధన, కనక, వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్ద్యర్థం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సమస్త దురితోపశమనార్థం శ్రీ సదాశివ స్వామిదేవతా దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన, వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,
ఏకదంతాయ నమః,
కపిలాయ నమః,
గజకర్ణికాయ నమః,
లంబోదరాయ నమః,
వికటాయ నమః,
విఘ్నరాజాయ నమః,
గణాధిపాయ నమః,
ధూమకేతవే నమః,
గణాధ్యక్షాయ నమః,
ఫాలచంద్రాయ నమః,
గజాననాయ నమః,
వక్రతుండాయ నమః,
శూర్పకర్ణాయ నమః,
హేరంబాయ నమః,
స్కందపూర్వజాయ నమః,
ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
మహాగణాదిపతియే నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధూపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానము

శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్ర్తం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||

ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి (నమస్కరించవలెను)

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః |
అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ||
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి (విగ్రహమునకు క్రింది భాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను)

మౌక్తికైః పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీవరసిద్ధి వినాయక ఆసనం సమర్పయామి (పుష్పములుంచాలి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి (విగ్రహము యొక్క చేతులపై నీటిని చల్లవలెను)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ఠ ప్రదాయక |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహోణ ద్విరదానన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి (పాదముల వద్ద నీటిని చల్లవలెను)

అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః గృహోణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)

దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం |
మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి (ఆవుపాలు పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము నుంచవలెను)

స్నానం పంచామృతైర్దేవ గృహోన గణనాయక |
అనాధనాధ సర్వజ్ఞా గీర్వాణ గణపూజిత ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతాలనగా - 1. ఆవుపాలు 2. ఆవుపెరుగు 3. ఆవునెయ్యి 4. తేనే, లేక చెరకు రసము, 5. పంచదార లేదా ఫలోదకము, లేక పండ్ల రసము - వీటన్నిటితో వేరువేరుగా కాని, ఒకేసారిగా కాని స్నానము చేయించవలెను)

శో|| రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం |
శుభప్రద గృహోణ త్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి
(ఎర్రని పుష్పము, లేదా ఎర్రని అంచు గల రెండు వస్త్రములను సమర్పించవలెను)

రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి 
(వెండి తీగతో చేసిన యజ్ఞోపవీతము, బంగారు తీగతో చేసిన ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు పుష్పములుంచవలెను)

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ త్వదర్ధం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ ధారయామి (చందనము పూయాలి)

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంధ శంభుపుత్ర సమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)

శ్లో|| సుగంధిని చ పుష్పాణి వాతకుంద ముఖానిచ |
ఏక వింశతి పత్రాణి గృహాన్ గణనాయక ||

అథాంగ పూజా

(మంత్రమును చదువుతూ దాని కెదురుగా తెల్పిన చోట పూజింపవలెను)
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి (మడిమలు)
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్లు)
ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి (పిక్కలు)
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి (తొడలు)
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి (పిరుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)
ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి (రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి (భుజములు)
ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి (చేతులు)
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి (కన్నులు)
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః (తల)
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి (శరీరం)

అథ ఏకవింశతి పత్ర పూజా

(21 ఆకులతో పూజ చేయవలెను. పూజించవలసిన ఆకులు బ్రాకెట్లలో తెలియజేయబడునవి)
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మమ్ పూజయామి (గరిక)
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి దళములు)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (జాజి ఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి
(పూజచేయగా మిగిలిన ఆకులన్నియు)

అష్టోత్తర శతనామ పూజ

(ప్రతి మంత్రమును చదువుతూ ఒక్కొక్క పూవు, లేదా అక్షతలు వేయవలెను)
ఓం వినాయకాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ:
ఓం గౌరీపుత్రాయ నమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం స్కందాగ్రజాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం పూషాయ నమ:
ఓం దక్షాయ నమ:
ఓం అధ్యక్షాయ నమ:
ఓం ద్విజప్రియాయ నమ:
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ:
ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ:
ఓం వాణీ ప్రదాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ:
ఓం శర్వతనయాయ నమ:
ఓం శర్వరీ ప్రియాయ నమ:
ఓం సర్వాత్మకాయ నమ:
ఓం సృష్టికర్తాయ నమ:
ఓం దేవానేకార్చితాయ నమ:
ఓం శివాయ నమ:
ఓం శుద్ధాయ నమ:
ఓం బుద్ధి ప్రదాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం బ్రహ్మచారిణే నమ:
ఓం గజాననాయ నమ:
ఓం ద్వైమాతురాయ నమ:
ఓం మునిస్తుత్యాయ నమ:
ఓం భక్తవిఘ్నవినాశయ నమ:
ఓం ఏకదంతాయ నమ:
ఓం చతుర్బాహవే నమ:
ఓం చతురాయ నమ:
ఓం శక్తిసంయుతాయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం హరిర్ర్బహ్మవిదే నమ:
ఓం ఉత్తమాయ నమ:
ఓం కాలాయ నమ:
ఓం గ్రహపతయే నమ:
ఓం కామినే నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం పాశాంకుశధరాయ నమ:
ఓం చండాయ నమ:
 ఓం గుణాతీతాయ నమ:
ఓం నిరంజనాయ నమ:
ఓం అకల్మషాయ నమ:
ఓం స్వయంసిద్ధాయ నమ:
ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ:
ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ:
ఓం వరదాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం కృతినే నమ:
ఓం ద్విజప్రియాయ నమ:
ఓం వీతభయాయ నమ:
ఓం గదినే నమ:
ఓం చక్రినే నమ:
ఓం ఇక్షుచాపధృతే నమ:
ఓం శ్రీదాయినే నమ:
ఓం అజాయ నమ:
ఓం ఉత్పలకరాయ నమ:
ఓం శ్రీపతయే నమ:
ఓం స్తుతిహర్షితాయ నమ:
ఓం కులాద్రిభేదినే నమ:
ఓం జటిలాయ నమ:
ఓం కలికల్మషనాశనాయ నమ:
ఓం చంద్రచూడామణయే నమ:
ఓం కాంతాయ నమ:
ఓం పాపహారిణే నమ:
ఓం సమాహితాయ నమ:
ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
ఓం సౌమ్యాయ నమ:
ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం కైవల్యసుఖదాయ నమ:
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
ఓం జ్ఞానినే నమ:
ఓం దయాయుతాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం బ్రహ్మణ్యే నమ:
ఓం ద్వేషవివర్జితాయ నమ:
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం విబుధేశ్వరాయ నమ
ఓం రమార్చితాయ నమ:
ఓం విధినే నమ
ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
ఓం స్థూలకంఠాయ నమ:
ఓం స్వయంకర్తాయ నమ:
ఓం సామ ఘోషప్రియాయ నమ:
ఓం పరాయ నమ:
ఓం స్థూలతుండాయ నమ:
ఓం అగ్రణినే నమ:
ఓం ధీరాయ నమ:
ఓం వాగీశాయ నమ:
ఓం సిద్ధిదాయాయ నమ:
ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
ఓం అవ్యక్తమూర్తయే నమ:
ఓం అద్భుతమూర్తయే నమ:
ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
ఓం సమస్తజగదాధారాయ నమ:
ఓం మాయావినే నమ:
ఓం మూషకవాహనాయ నమ:
ఓం హృష్టాయ నమ:
ఓం తుష్టాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
ఓం శ్రీ వరసిద్ది వినాయకాయ నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

శ్లో || దశాంఙ్ఞం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి

(దశాంజ్గము, గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను. లేదా, అగరువత్తి వెలిగించవలెను)

శ్లో || సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ||
శ్రీవరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి (దీపమును చూపాలి)

శ్లో || సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
శ్లో || భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మహానైవేద్యం సమర్పయామి (పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను)

శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సమ్యుక్తం తాంబూరం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి (వక్క, పచ్చకర్పూరము ఉంచి తాంబూలం సమర్పించవలెను)

శ్లో|| సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుప్య వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ పుష్పం సమర్పయామి (పుష్పములు సమర్పించవలెను.)

శ్లో || ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను)

నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి (నీటిని సమర్పించవలెను)

ఆథ దూర్వాయుగ్మ పూజా

(ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క జత గరిక వేయవలెను)
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం లఖు వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
(దోసలియందు పుష్పమునుంచుకొని క్రింది మంత్రమును చెప్పాలి)

శ్లో|| గణాధిప నమస్త్రేస్తు ఉమాపుత్రాఘనాశన
వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక |
ఏకదంతైక వదన తథా మూషిక వాహన
కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పములను ఉంచవలెను)

శ్లో || ప్రదిక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్త్రే విఘ్న నాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ చేయవలెను)

శ్లో || ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక |
గంధపుష్పాక్షతైర్ముక్తం పాత్రస్థం పాపనాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం సమర్పయామి (పై శ్లోకము చెప్పుచూ 3 మార్లు నీటిని విడువవలెను)

శ్లో || వినాయక నమస్తుభ్యం సతతం - మోదకప్రియ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (గణపతికి నమస్కరించవలెను)

వాయన దానము

శ్లో || గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ |
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ||
(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)

మంత్రము
దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామా దదే

(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
(పూజ చేసినవారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||

శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక ||

విఘ్నేశ్వరుని కథా ప్రారంభము

సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును తన్నివారణమును చెప్పదొడంగెను.

పూర్వము గజ రూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంబుకోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను.

కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతి వృత్తంతము తెలిపి, 'మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడుకూడ నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము ' అని విలపింప, శ్రీహరియా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతల చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై 'మీకేమి కావలయునో కోరుడొసంగెద ' ననిన, హరి వానిని సమీపించి, 'ఇది శివుని వాహనమును నంది ', శివుని కనుగొనుటకై వచ్చే. కావున శివునొసంగు ' మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని 'నా శిరస్సు త్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు 'మని ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నంది తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి 'దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసి నట్లగు ' నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాము వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసంబున కతివేగంబున జనియె.

వినాయకోత్పత్తి

కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమొంది అభ్యంగన స్నానమాచరించును నలుగుబిండి నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నందినారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోని కేగెను.

అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వా రిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి 'గజాననుడు ' అని నామం బొసగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.

కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహన రాజము నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.

విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసంగుమనియు, 'గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు గనుక ఇయ్యాధిపత్యము తన కొసంగు 'మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.

శివుడక్కుమారులను జూచి, 'మీలో నెవ్వరు ముల్లోకములందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు 'నని మహేశ్వరుండు పలుక, వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనంబు నెక్కి వాయు వెగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి 'అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్ష ముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే ' యని ప్రార్ధింప, మహేశ్వరుడు దయాళుడై, 'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రంబు పటించు ' మనగా, గజాననుడు సంతసించి, అత్యంతభక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.

అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాంపింగ, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోకూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు ' మని ప్రార్ధించెను.

అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లాలిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమనొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత రాజ దృష్టి సోకి రాలు కుడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ర్పదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురుగాక ' అని శపించెను.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషు లద్దానింగనుగొని అగ్నిదేవునితోనున్న వారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాప నింద కలిగినది.

దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్తఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మకైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.

అంత దేవాదులు, 'ఓ పార్వతీ దేవీ! నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు 'మని ప్రార్ధింప, పార్వతి సంతసించి, 'ఏ దినంబున ' విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాదాని శాపావ కాశంబు నొసగె. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి, భాద్ర పద శుద్ధ చతుర్ధి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.

శమంతకోపాఖ్యానము

ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు, 'స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!' అని పూర్వ వృత్తంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గలోకమున కేగెను.

అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుండుగాన, తాను మింటివంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, 'ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో' యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజునకి ' మ్మనెను. అతడది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వ 'డనిన, పోనిమ్మని శ్రీకృష్ణుడూరకొనెను.

అంత నొకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేను డా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహ మా మణిని మాంసఖండ మని భ్రమించి, వాని జంపి ఆ మణిని గొని పోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొని తమ కుమార్తె కాటవస్తువుగ నొపంగెను. మఱునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, 'కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె, నని నగరము చాటె. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్క చోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాంపించెను.

ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము నచట విడిచి కృష్ణుండు గుహ లోపలి కేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి యున్న మణిని జూచి అచ్చటికిబోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంట ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాదియును వింత మనిషి వచ్చేననుచు కేకలు వేసెను.

అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను రాళ్ల చేతను, తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువదెనిమిది దినంబుల యుద్ధ మొనర్పజాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్తజన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కొరుమని ఆజ్ఞ యెసంగ నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరు కొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితురి.

ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్ధింప, శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీర మంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, 'భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటువచ్చితిని గాన మణి నొసంగుము. నే నెగెదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావ ద్వృత్తాంతమును చెప్పి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు 'అయ్యో! లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి ' నని విచారించి మణిసహహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు మని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి 'యని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదంబున చంద్రదర్శ మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక! అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.

వినాయక చవితి పద్యములు

ప్రార్థన :


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము:

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
 - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
 - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
 - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
 - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను
 - జయమంగళం నిత్య శుభమంగళం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.