Pages

Things needed for Vinayaka chavithi Pooja

వినాయకచవితి పూజకు కావలసిన సామాగ్రి

  1. లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.
  2. శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.
  3. చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
  4. చేయవలసిన స్నానము : తలస్నానము
  5. ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
  6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు, పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
  7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
  8. పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి
  9. తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు
  10. పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు
  11. అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల
  12. నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు
  13. సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు
  14. నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ
  15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము
  16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం
  17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
  18. పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం
  19. పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన
  20. పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం
  21. చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం
  22. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
  23. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
  24. ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము
  25. పర్వదిన నక్షత్రము : హస్త
  26. పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి
  27. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
  28. వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు
  29. వెలిగించవలసిన దీపారాధనలు : 2
  30. వెలిగించవలసిన వత్తులసంఖ్య : 7
  31. వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు
  32. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె
  33. వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి
  34. ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
  35. నుదుటన ధరించవలసినది : విభూది
  36. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః
  37. జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల
  38. మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల
  39. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి
  40. చేయవలసిన అభిషేకము : పంచామృతములతో
  41. ఏ దిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.