Pages

How to perform Vinayaka Nimajjanam

నిమజ్జనం చేసే విధానం 
How to perform Vinayaka Nimajjanan

How to perform Vinayaka Nimajjanan
How to perform Vinayaka Nimajjanan
దేవీ నవరాత్రులు నిర్వహించినట్లు  వినాయకచవితికి కూడా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది.

నిమజ్జనాన్ని 3 లేదా  5, 7, 9వ రోజు గానీ నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య విన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్ధ ప్రసాదాలను అందరూ తిని, ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. గణనాధుడిని నీటిలోకి విడిచే ముందు

"శ్రీ గణేశం ఉద్వాసయామి.....
శోభనార్ధం పునరాగమనాయచ" అని పఠించడం సంప్రదాయం.

గణేష నిమజ్జనం అత్యంత భక్తితో కూడుకున్నదైనా, భక్తులు ప్లాస్టర్-ఆఫ్-పారిస్ వాడడం వలన నీటి నవరులకు కలుషితమవుతాయి. దీని వలన నీటి ఆమ్లగుణం పెరిగి, నీరు కలుషితమై, జలచరాలకే కాకుండా, వాటిని వాడిన మనిషికి కూడా యెంతో కీడు చేస్తాయి. పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ భక్తునిపైనా ఉంది.

 పర్యావరణ శాఖ/ స్వచ్ఛంద సంస్థలు అనేకం దీని కోసం ఈ సూచనలను ఇస్తున్నాయి:

మన అమ్మానాన్నలు వాడినట్లు మట్టితో చేసి, పెయింట్ లేని గణపయ్య మూర్తులను పూజకు వాడడం, ఇంట్లోనే ఒక బకెట్టు నీటిలో నిమజ్జనం చేసి, ఆ నీటిని పచ్చటి మొక్కలకు పొయ్యడం

రాతితోనో లేక రాగితోనో చేసిన గణపయ్య మూర్తిని ప్రతీ సంవత్సరం వాడి, దానికి నిమజ్జన క్రియను చేయడం

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.